Raja the great is coming on Oct.18

Thursday Oct 05, 2017
Raja the great original

మాస్ మహారాజ్ రవితేజ తాజా చిత్రం ‘రాజా ది గ్రేట్’ దీపావళి సందర్భంగా అక్టోబర్ 18న విడుదల చేయబోతున్నట్లు ఆ సినిమా నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. పటాస్, సుప్రీమ్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

ఈ చిత్రంలో రవితేజ అంధుడుగా నటించడం విశేషం. అటువంటి పాత్ర చేయడం నిజంగా చాలా సాహసమేనని చెప్పక తప్పదు. ముఖ్యంగా.. చాలా కాలంగా హిట్స్ లేని రవితేజ అటువంటి పాత్రను..కధతో ఈ సినిమా చేయడం ఇంకా సాహసమే అవుతుంది. ఆ పాత్రలో రవితేజ ప్రేక్షకులను మెప్పించడం ఖాయమే కానీ హీరోను అంధుడుగా పెట్టి ఒక కమర్షియల్ సినిమా తీసి హిట్ కొట్టాలంటే, కధలో చాలా బలం ఉండి ఉండాలి. బహుశః ఉంది గనుకనే విజయవంతమైన సినిమాలు తీసే దిల్ రాజు ఈ సినిమాను నిర్మించడానికి అంగీకరించి ఉండవచ్చు. ఎలాగూ మరో రెండువారాల్లో సినిమా వచ్చేస్తోంది కనుక అంతవరకు ఓపిక పడితే రాజా నిజంగానే గ్రేటా కాదా? అనే సంగతి తేలిపోతుంది.

ఈ సినిమా పాటలు బుధవారం విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ చూస్తే సినిమా చాలా గొప్పగా ఉండబోతోందని అర్ధం అవుతోంది. నిన్న విడుదలైన పాటలు కూడా చాలా క్యాచీగా ఉన్నాయి.  

ఈ సినిమాలో మెహ్రీన్ ఫిర్జాదా రవితేజకు జోడీగా నటించింది. అలనాటి అందాల హీరోయిన్ రాధిక రవితేజకు తల్లిగా నటించారు. జై లవకుశతో మంచి హిట్ అందుకొన్న రాశీ ఖన్నా రాజా ది గ్రేట్ కోసం ఐటెం సాంగ్ చేసింది. ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్, వివాన్ బంతెన తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు నిర్మిస్తున్నారు. దీనికి సినిమాటోగ్రఫీ: మోహన కృష్ణ, సంగీతం: సాయి కార్తీక్ అందించారు. 

 

More News on Cinema Gala