Raja the Great title song is excellent

Tuesday Sep 19, 2017
Raja the great original

నువ్వు త‌ళ త‌ళ టుతౌజెండ్ నోటు రా...అంటూ సాగిన రాజా ది గ్రేట్ టైటిల్ సాంగ్ ను దాని మేకింగ్ తో సహా నిన్న విడుదల చేశారు. శ్యాం కాసర్ల వ్రాసిన ఆ పాటని రవితేజ, శ్రీనివాస్ రెడ్డి, ఎల్.వి.రేవంత్, సాకేత్.కె అద్భుతంగా చాలా అలవోకగా పాడారు. ఆ పాట లిరిక్స్ కూడా కూడా యూత్ ను అట్రాక్ట్ చేసే విధంగా చాలా క్యాచీగా ఉన్నాయి. వారందరూ హుషారుగా ఆ పాట పడుతుంటే పక్కనే నిర్మాత దిల్ రాజు వారిని చూసి చిరునవ్వులు చిందిస్తూ కనబడతారు. ఈ పాటకు సాయి కార్తీక్ అందించిన సంగీతం కూడా చాలా బాగా సూట్ అయ్యింది. ఈ టైటిల్ సాంగ్ రిలీజ్ చేసిన 22 గంటలలోనే 5 లక్షల మందికి పైగా యూ ట్యూబ్ లో చూశారు.
ఈ సినిమాలో రవితేజ గుడ్డివాడిగా నటిస్తున్నాడు. అతనికి జంటగా మెహ్రీన్ ఫిర్జాదా నటిస్తోంది. ఈ చిత్రంలో రాశి ఖన్నా ఒక అతిధి పాత్ర చేస్తుండగా, ప్రకాష్ రాజ్, రాధిక, సంపత్ రాజ్, వివాన్ బంతెన తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు నిర్మిస్తున్నారు. దీనికి మోహన కృష్ణ సినిమాటోగ్రఫీ, సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 12న విడుదలకాబోతోంది.

 

More News on Cinema Gala