Raja the great title track releasing today

Monday Sep 18, 2017
Raja the great teaer date cinemagala001 original

2015 లో రిలీజ్ అయిన బెంగాల్ టైగర్ సినిమా తరువాత ఇంతవరకు రవితేజ సినిమా ఒక్కటీ రిలీజ్ కాలేదు. సినీ ఇండస్ట్రీలో హీరో లేదా హీరోయిన్ అంత గ్యాప్ తీసుకోవడమంటే అది ఆత్మహత్యతో సమానమే. ఎందుకంటే, ఎవరి అభిమానులు, మార్కెట్ వారికున్నప్పటికీ ఈలోగా వేరేవాళ్ళు ఆ స్థానాన్ని ఆక్రమించేసే ప్రమాదం ఉంటుంది. అందుకే రవితేజ తను మొదలుపెట్టిన రాజా ద గ్రేట్, టచ్ చేసి చూడు సినిమాలలో రాజా ద గ్రేట్ చిత్రాన్ని పూర్తిచేసి వీలైనంత త్వరగా విడుదల చేయడం కోసం రెండవ దానిని కాస్త స్లో చేశాడు. సోమవారం దాని టైటిల్ సాంగ్ ట్రాక్ విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో రవితేజ అంధుడిగా నటిస్తుండటం విశేషం. మెహ్రీన్ ఫిర్జాదా హీరోయిన్ గా చేస్తోంది. ప్రకాష్ రాజ్, రాధిక, సంపత్ రాజ్, వివాన్ బంతెన ముఖ్యపాత్రలు చేస్తున్నారు. రాశి ఖన్నా ఒక అతిధి పాత్రలో కనిపించబోతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు నిర్మిస్తున్నారు. దీనికి మోహన కృష్ణ సినిమాటోగ్రఫీ, సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే నెల 12న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

 

More News on Cinema Gala