షాలినీ పాండే 100% లవ్ విత్ ప్రకాష్ కుమార్

Monday Nov 06, 2017
Shalini pandey gvp in 100  kaadhal original

తెలుగులో నాగ చైతన్య, తమన్నా జంటగా నటించిన 100% లవ్ సూపర్ హిట్ చిత్రాన్ని తమిళంలో 100% కాదల్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. దానిలో అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలినీ పాండే తమన్నా పాత్ర చూస్తుండగా, జివి ప్రకాష్ కుమార్ నాగ చైతన్య పాత్ర చేస్తున్నారు. ఆ చిత్రం ఫస్ట్-లుక్ పోస్టర్ ఆదివారం విడుదలయింది. దానిలో ప్రకాష్ కుమార్ టీవిగా సూటుబూటు వేసుకొని మోకాళ్ళపై కూర్చొని షాలినీ పాండేకు ప్రపోజ్ చేస్తుండగా, ఆమె ఉయ్యాలలో కాలుమీద కాలువేసుకొని సిగ్గుపడుతోంది. తెలుగులో సుకుమార్ దర్శకత్వం చేసిన ఈ సినిమాకు తమిళ వెర్షన్ లో చంద్రమౌళి దర్శకత్వం చేస్తున్నారు. హీరోగా నటిస్తున్న ప్రకాష్ కుమారే ఈ సినిమాకు సంగీతం కూడా అందిస్తున్నారు. మరో విశేషమేమిటంటే, తెలుగులో దీనికి దర్శకత్వం చేసిన సుకుమార్ దీనిని నిర్మిస్తున్నారు. సహ నిర్మాత భువన.ఎం తో కలిసి క్రియేషన్ సినిమాస్ ఎన్.వై మరియు ఎన్.జె.ఎంటర్టేయిన్మెంట్ బ్యానర్లలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జూలైలో విడుదలకాబోతోంది.

ఇది చదివారా? గూడఛారిగా వస్తున్న అడివి శేష్