గూడఛారిగా వస్తున్న అడివి శేష్

Sunday Nov 05, 2017
Goodachari original

‘క్షణం’ వంటి మంచి చిత్రంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన అడివి శేష్, ప్రస్తుతం ‘గూడఛారి’ అనే యాక్షన్ ప్యాక్ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాలో మన తెలుగమ్మాయి..మిస్ ఇండియా శోభితా ధూళిపాళ కధానాయికగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అలాగే నూతన దర్శకుడు శశికిరణ్ తిక్క కూడా ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు.

ఈ సినిమా టైటిల్ లోగో మరియు కాన్సెప్ట్ పోస్టర్ శనివారం విడుదల చేశారు.ఈ సందర్భంగా నిర్మాత అభిషేక్ నామా మీడియా ప్రతినిధులకు తమ సినిమా గురించి వివరించారు.

“ఈ చిత్రంలో అడివి శేష్ ఒక రహస్య గూడఛారిగా నటిస్తున్నాడు. దీనిని హై టెక్నికల్ వాల్యూస్, మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో తెరకెక్కిస్తున్నాము. ఈ సినిమాతో మన తెలుగమ్మాయి మిస్ ఇండియా శోభితా ధూళిపాళను హీరోయిన్ గా పరిచయం చేస్తున్నాము. ఈ సినిమా షూటింగ్ 3 నెలలో పూర్తి చేసి డిసెంబర్ 17న ఫస్ట్-లుక్ విడుదల చేస్తాము. ఈ చిత్రాన్ని వచ్చే వేసవి శలవులలో విడుదల చేయబోతున్నాము,” అని చెప్పారు.

అభిషేక్ పిక్చర్స్ మరియు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లలో అభిషేక్ అగర్వాల్, టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: శ్రీచరణ్ పాకాల, కెమెరా: షానిల్ డియో, డైలాగ్స్: అబ్బూరి రవి అందిస్తున్నారు.

ఇది చదివారా? లక్ష్మీస్ వీరగ్రంధం స్క్రిప్టుకి పూజలు