అమ్మో అమ్మీ...అదిరిపోయింది

Wednesday Oct 11, 2017
Robot1110 original

శంకర్-రజనీకాంత్ కాంబినేషన్ లో వస్తున్న 2.0 చిత్రంలో హాలీవుడ్ సుందరి అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈరోజు నుంచి ఆమె కూడా ఆ సినిమా షూటింగులో పాల్గొనడం ప్రారంభించింది. మొదటగా ఆమెపై సాంగ్ షూట్ చేస్తున్నట్లు దర్శకుడు శంకర్ ట్వీట్ ద్వారా తెలియజేశాడు. దానితో బాటు రోబో డ్రెస్ లో ఉన్న అమీ జాక్సన్ ఫోటోను కూడా పోస్ట్ చేశాడు. ఆ డ్రెస్ లో ఆమె చాలా అద్భుతంగా ఉంది.

తెలుగు, తమిళ్, హిందీ బాషలలో నిర్మితమవుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాకు ఏఆర్ రహమాన్ సంగీతం అందించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: కుతుబ్-ఏ-క్రిపా, కెమెరా: మ్యాన్ నీరవ్ షా. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది.