రజనీతో ‘అమీ’ తుమీ

Tuesday Oct 10, 2017
Amy robotrajini original

శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న 2.0 చిత్రంలో హీరోయిన్ పాత్రకు హాలీవుడ్ నటి అమీ జాక్సన్ ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఆమె కూడా రేపటి నుంచి షూటింగ్ లో పాల్గొనడానికి చెన్నై వచ్చింది. ఈ సందర్భంగా ఆమె రజనీకాంత్ తో ఫోటో దిగి, ‘రేపటి నుంచి రోబో రజనీతో షూటింగ్ స్టార్ట్’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రేపటి నుంచి వారిరువురూ ఉండే సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. 

ఆమె లేకుండానే సినిమా షూటింగ్ దాదాపు చివరిదశ వరకు తీసుకువచ్చేయడం దర్శకుడు శంకర్ కే చెల్లునేమో? ఆమె హాలీవుడ్ లో చాలా పేరున్న బిజీ నటి. కనుక ఒక భారతీయ సినిమాకు ఆమె డేట్స్ ఇవ్వడమే విచిత్రం. అయినా ఇచ్చింది కనుక వాటి ప్రకారం శంకర్ సినిమాను ప్లాన్ చేసుకొని ముందుకు సాగిపోతూ సినిమాను దాదాపు పూర్తి చేసేశాడు. రేపటి నుంచి ఆమె కూడా షూటింగులో పాల్గొంటుంది కనుక ఇక బహుశః ఇదే ఆఖరు షెడ్యూల్ కావచ్చు.

రజనీ-అమీ జాక్సన్ ల ఈ 2.0 చిత్రం రిలీజ్ డేట్స్ తో సహా వాటి ఆడియో, ట్రైలర్. టీజర్ రిలీజ్ డేట్స్ అన్నీ ఖరారు చేసేసిన సంగతి తెలిసిందే. నవంబరు 27న దుబాయ్ లో ఆడియో రిలీజ్, అదే నెలలో హైదరాబాద్ లో తెలుగు టీజర్ రిలీజ్, డిశంబర్ లో ధియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసి, జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఈ మద్యనే ఈ చిత్రం మేకింగ్ వీడియోను కూడా రిలీజ్ చేశారు.

 ఈ సినిమాకు కెమెరా: మ్యాన్ నీరవ్ షా, సంగీతం: ఏఆర్ రహమాన్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: ఏఆర్ రహమాన్ మరియు కుతుబ్-ఏ-కృప అందిస్తున్నారు.