మెగాస్టార్ కి జోడి గా స్వీటీ???

Monday Jun 19, 2017
C original

రామ్ చరణ్ నిర్మాత గా మెగాస్టార్ చిరంజీవి హీరో గా ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత చరిత్రను సినిమా గా తీయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం మెగా స్టార్ 151 వ చిత్రం కావడం విశేషం. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం రామ్ చరణ్ అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. చిరంజీవి కూడా మంచి ఫిజిక్ కోసం బాగా కష్టపడుతున్నారట. యాక్షన్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దారకత్వం లో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. అయితే ఈ ప్రాజెక్ట్ కు మొదట థమన్ ను సంగీత దర్శకుడిగా అనుకుని ఇపుడు ఏ. ఆర్. రెహ్మాన్ ను ఒప్పించే పని లో ఉన్నారంట. ఈ చిత్రం దేశవ్యాప్తంగా విడుదల చేయాలని భావిస్తున్నారట. అందుకు గాను ఈ సినిమా కు హీరోయిన్ గా అనుష్క ను ఒప్పిచే ప్రయత్నం లో ఉన్నాడట రామ్ చరణ్. అనుష్క బాహుబలి పుణ్యమా అని దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. ఈమె ఈ సినిమాలో నటిస్తే గనక దేశవ్యాప్తంగా ఈ సినిమా కు మంచి హైప్ వచ్చినట్లే అని చిత్ర బృందం భావిస్తోంది.