జి అశోక్ దర్శకత్వంలో అనుష్క ప్రధానపాత్ర చేస్తున్న లేడీ ఓరియంటెడ్ సినిమా భాగమతి. సోమవారం దాని ఫస్ట్-లుక్ ను విడుదల చేశారు. అటువంటి ఫస్ట్-లుక్ చిత్రాన్ని బహుశః ఎవరూ ఊహించి ఉండరు. చాలా భీభత్సంగా ఉంది అది. రక్తంతో తడిసిన దుస్తులతో ఒక చేతిని పైకెత్తి అనుష్క నిలబడి ఉంది. ఆ అరచేతిలో మద్యలో మేకు దిగగొట్టినట్లు రక్తం ఓడుతూ గాయం కనిపిస్తోంది. మరో చేతిలో రక్తం మరకలున్న సుత్తివంటి వస్తువు ఉంది. ఆమె కాళ్ళవద్ద ఎవరో పడిఉండగా చూస్తున్నట్లు నిలబడి ఉంది. ఆమె వెనుక గోడపై ఇనుపగొలుసులతో బందించిన ఒక మహిళ శరీరం వ్రేలాడుతూ సగం వరకే కనిపిస్తుంది. ఆమె కాలికి మట్టెలు, కడియాలు ఉన్నందున ఆమె ఒక వివాహిత మహిళ అని అర్ధం అవుతోంది.
ఈ ఫస్ట్-లుక్ ను చూస్తే ఈ సినిమా ఎవరి ఊహలకు అందని స్థాయిలో ఉండబోతోందని అర్ధం అవుతోంది. ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జయరాం, ముకుందన్, ఆశా శరత్ ముఖ్యపాత్రలు చేస్తున్నారు. తెలుగు, తమిళ బాషలలో ఒకేసారి నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకు ధమన్ సంగీతం అందిస్తున్నారు. ఇది 2018లో విడుదల కాబోతోంది.
ఇది చదివారా? అందుకే అదిరింది రిలీజ్ కాలేదా?