బాలయ్య సినిమా పేరు కర్ణ?

Tuesday Oct 10, 2017
Balakrishna original

 పైసా వసూల్ చిత్రం తరువాత నందమూరి బాలకృష్ణ కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు ‘కర్ణ’ అని పేరు ఖరారు చేసినట్లు తాజా సమాచారం. దాదాపు నెలరోజుల పాటు తమిళనాడు లో షూటింగ్ జరుపుకొని వచ్చి ఇప్పుడు హైదరాబాద్ లో 3వ షెడ్యూల్ చేస్తున్నారు. అది ఈనెల 16వరకు సాగుతుంది. ఈ షెడ్యూల్ ల్లో క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయిన తరువాత పాటల చిత్రీకరణ కోసం విదేశాలకు వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది.

బాలకృష్ణకు సరైన జోడీగా పేరు పొందిన నయనతార ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. సెకండ్ హీరోయిన్ గా నటాషా దోషి చేస్తోంది. వారుకాక ఇంకా ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, ప్రకాష్ రెడ్డి మొదలైనవారు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేస్తున్నారు.

వచ్చే సంక్రాంతి పండుగకు ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకు సంగీతం: చిరంతాన్ భట్, కెమెరా: రాం ప్రసాద్ అందిస్తున్నారు.