24న వస్తున్న బాలకృష్ణుడు

Thursday Nov 02, 2017
Balakrishnudu original

నారా రోహిత్ ప్రత్యేకత ఏమిటంటే తన సినిమాల జయాపజయాలను పట్టించుకోకుండా ఎప్పటికప్పుడు విభిన్నమైన కధాంశాలతో సినిమాలు చేస్తుంటాడు. శమంతకమణి’, ‘కథలో రాజకుమారిఅటువంటి చిత్రాలే. తరువాత ‘బాలకృష్ణుడు’ అనే సినిమాతో ఈనెల 24న రాబోతున్నాడు. దీనిలో నారా రోహిత్ సిక్స్ ప్యాక్స్ తో కనబడతాడు. అతనితో రెజినా జతకట్టింది. పవన్ మల్లెల దర్శకత్వంలో బి.మహేంద్రబాబు, ముసునూను వంశీ, వినోద్‌ నందమూరి మాయా బజార్‌ మూవీస్‌ బ్యానర్ పై దీనిని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ చాలా పవర్ ఫుల్ పాత్ర చేస్తున్నారని నిర్మాతలు చెప్పారు. ఈనెల 10వ తేదీన ఈ సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు.  

ఇది చదివారా? త్రివిక్రమ్ దర్శకత్వంలో మెగా బ్రదర్స్?