అయ్యో బాబీ....మళ్ళీ నా

Thursday Apr 06, 2017
Bobby director youtube original

అయ్యో బాబీ....మళ్ళీ నా

ఎన్టీఆర్ జై లవ కుశ కి బాబీ డైరెక్టర్ అన్నప్పుడు ఒకింత ఆశ్చర్యం అందరి లోను కలిగే ఉంటుంది. ఎన్టీఆర్ ఏంటి ప్లాప్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చాడు అని. ఎందుకంటే బాబీ అప్పుడే ఫ్రెష్ గా  డిసాస్టర్ ఇచ్చాడు మరి సర్దార్ గబ్బర్ సింగ్  రూపంలో. కానీ ఆ ప్లాప్ క్రెడిట్ అంత పవన్ కళ్యాణ్ కి వెళ్ళిపోయి బాబీ సేఫ్ సైడ్ అయిపోయాడు. అయ్యో పాపం, తాను చెయ్యని పనికి తనకి ప్లాప్ ఒచ్చిందని కూడా ఫీల్ అయిపోయారు జనాలు.

మరి ఇప్పుడు బాబీకి మళ్ళీ ఇంకో సర్దార్ గబ్బర్ సింగ్ రిపీట్ అవుతుందని ఇండస్ట్రీలో గుస గుసలు వినిపిస్తున్నాయి. మేటర్ ఏంటంటే జై లవ కుశ సెట్ లో బాబీ మళ్ళీ షో హ్యాండే అయ్యాడట. ఎన్టీఆర్, కెమెరామాన్ కలిసి బాబీ ని పక్కన పెట్టేసి తమకి నచ్చినట్టు సీన్లు చేసేసుకుంటున్నారట. వీటన్నిటికీ కలిపి ఈ స్టోరీ అసలు బాబీదే కాదని, ఒక హాలీవుడ్ సినిమా స్టోరీని తీసుకొచ్చి మన నేటివిటీకి తగ్గట్టు తీసేస్తున్నారని వినికిడి. స్టోరీ, సీన్స్ అన్ని ముందే తెలిసుండటంతో బాబీని పక్కన పెట్టేశారంట. పాపం బాబీ, మళ్ళీ పేరులో తప్ప ఇంకా దేనిలో తన ప్రమేయం లేకుండా ఇంకొక సినిమాకి పని చేసేస్తున్నాడు.