బాలీవుడ్ విలన్ తో పోటీ పడనున్న జూ. ఎన్టీఆర్

Saturday Jun 10, 2017
19neil nitin mukesh original

జూ. ఎన్టీఆర్ నటిస్తున్న 'జై లవ - కుశ' సినిమా కి బాలీవుడ్ నుండి విలన్ ను తీసుకురాబోతున్నారట . బాలీవుడ్ హీరో అయినా నీల్ నితిన్ ముకేశ్ ఈ సినిమా లో విలన్ గ నటించబోతున్నారంట. ఇప్పటికే ఈ సినిమా లో ఎన్టీఆర్ ఒక విలన్ పాత్రలో నటించబోతున్నట్లు తెలిసిందే. ఇక దీనికి తోడు ఇపుడు బాలీవుడ్ నుండి ఈ విలన్ వస్తుండడంతో సినిమా లో విలనిజం ఏ రేంజ్ లో ఉంటుందా అనే ఆసక్తి నెలకొంది. నీల్ నితిన్ ముకేశ్ సాహో లో కూడా విలన్ గ కనిపించబోతున్నారు . అయితే సాహో కన్నా ముందు  ఎన్టీఆర్ సినిమా నే వస్తుండడంతో ఇదే తెలుగు లో ఇతనికి మొదటి చిత్రం కానుంది . ఇప్పటికే ఇతను తమిళ్ కత్తి లో విలన్ గ నటించి మార్కులు కొట్టేసారు.

ఇక చిత్ర విషయానికి వస్తే కె. ఎస్. రవీంద్ర ఈ సినిమా కు దర్శకత్వం వహించబోతున్నారు . కళ్యాణ్ రామ్ ఈ సినిమా ను నిర్మిస్తున్నారు  కథానాయికలుగా రాసి కన్నా , నివేద థామస్ natistunnaru. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు .