చైతు-సమంతల రిసప్షన్ 12న

Thursday Nov 02, 2017
Chaitu samantha %282%29 original

నాగ చైతన్య-సమంతల పెళ్ళి జరిగి అప్పుడే నెలరోజులు కావస్తోంది. వారు హనీమూన్ కి విదేశాలకు వెళ్ళడంతో వారు తిరిగి రాగానే హైదరాబాద్ లో ఘనంగా వారి పెళ్ళి రిసప్షన్ ఏర్పాటుచేయడానికి నాగార్జున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 12వ తేదీన హైదరాబాద్ మాదాపూర్ లో గల వారి ఎన్-కన్వెన్షన్ లో రిసప్షన్ ఏర్పాటుచేయబోతున్నారు. వారి పెళ్ళికి సినీ, రాజకీయ తదితర రంగాల ప్రముఖులను ఎవరినీ ఆహ్వానించలేదు కనుక ఇప్పుడు వారందరికీ పేరుపేరునా నాగార్జున ఇన్విటేషన్లు పంపిస్తున్నారుట. 

ఈ కార్యక్రమానికి తెలుగు, తమిళ, మళయాళం మరియు హిందీ సినీప్రముఖులను, ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల అధికార, ప్రతిపక్ష రాజకీయ నాయకులను, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలను ఆహ్వానించబోతున్నారని తెలుస్తోంది. 

ఈ కార్యక్రమం ముగిసిన తరువాత నాగ చైతన్య, సమంత ఇద్దరూ తమ తమ సినిమాలను మొదలుపెడతారు. నాగ చైతన్య మారుతి దర్శకత్వంలో (శైలజారెడ్డి అల్లుడు) ఒక సినిమాను, చందూ మొండేటి దర్శకత్వంలో ‘సవ్యసాచి’ సినిమాలను చేయవలసి ఉంది. 

ఇక సమంత, సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న రంగస్థలం 1985, మహానటి సావిత్రి జీవిత కధ ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మహానటి’ చిత్రాలు చేయవలసి ఉంది. అంటే వారు రిసప్షన్ తరువాత ఇద్దరూ మళ్ళీ పూర్తిగా బిజీ అయిపోతారన్నమాట.  

ఇది చదివారా? Venky-Chay multistarrer makes to news again