రెండు పెళ్ళిళ్ళు..రెండు రెసిప్షన్లు..

Tuesday Oct 17, 2017
Chaitu samantha original

నాగ చైతన్య-సమంతలు హిందూ, క్రీస్టియన్ సంప్రదాయాల ప్రకారం రెండుసార్లు పెళ్ళి చేసుకొన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే వారి పెళ్ళి రిసప్షన్స్ కూడా రెండుసార్లు జరుగుతుండటం విశేషం. గోవాలో జరిగిన వారి రెండు పెళ్ళిలకు వారి సమీప బంధుమిత్రులను మాత్రమే ఆహ్వానించినట్లే, రెండురోజుల క్రితం చైతు మేనమామ దగ్గుబాటి సురేష్ ఏర్పాటు చేసిన ప్రైవేట్ రిసప్షన్ కు కేవలం అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలకు చెందినవారిని మాత్రమే ఆహ్వానించినట్లు తెలుస్తోంది. దీనికి దగ్గుబాటి హీరోలు రానా, వెంకటేష్, నాగ చైతన్య తల్లి లక్ష్మి తదితరులు హాజరయ్యారు. మళ్ళీ ఈ నెలాఖరులోగా నాగ చైతన్య-సమంతలు సినీ, రాజకీయ తదితర రంగాలలో వారందరి కోసం మరోసారి రిసప్షన్ ఇవ్వబోతున్నారు. ఒక జంటకు రెండేసి పెళ్ళిళ్ళు, రెండు రిసప్షన్ పార్టీలు జరుగడం విశేషమే కదా.