బాహుబలి తర్వాత ఒక మంచి స్టార్ నటించిన మాస్ చిత్రం రాలేదు. రారండోయ్ వేడుక చూద్దాం, అంధగాడు, అమీ తుమి ఇవన్నీ ఓ మాదిరిగా ఆడిన కేవలం మల్టీప్లెక్స్ ఆడియన్స్ కోసమే వచినట్లు అనిపించాయ్. ఇటువంటి పరిస్థితుల్లో భారీ స్థాయిలో వస్తున్న చిత్రం డిజె. మాస్ దర్శకుడు,మాస్ హీరో కాంబినేషన్ లో వస్తున్నా ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇందాకే ఈ సినిమా పాటలు కూడా విడుదల చేసారు. ఇప్పటికే రిలీజ్ అయిన వీడియో సాంగ్ లో అల్లు అర్జున్ డాన్స్ ఇరగదీసారు. ట్రైలర్ రొటీన్ గ నే ఉన్నా సినిమా కి మంచి పబ్లిసిటీ ఇస్తున్నారు. దీనికి తోడు వివాదాల వల్ల ఎదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తోంది. ఈ కారణాలన్నింటి వల్ల ఈ సినిమా కి అల్లు అర్జున్ కెరీర్ లో నే భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయంగా అనిపిస్తోంది. మరి హిట్ టాక్ దక్కించుకుంటుంద లేదా అనేది వేచి చూడాలి.