అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి

Friday Mar 03, 2017
Duvvada jagannadham first look telugu news original

 అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి


అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అంటే ఇదేనేమో. ఒక పని చెయ్యాలని తాపత్రయం తో ఎక్కువ చేసేసి ఒకటి చేయబోయి ఇంకొకటి చేసినట్టుంది పవన్ ఫాన్స్ తీరు. దువ్వాడ జగన్నాధం టీజర్ రిలీజ్ అవ్వటం, దానికి ఎలాగైనా  "డిస్లియిక్" కౌంట్ బాగా పెంచాలని పవన్ ఫాన్స్ భావించి అనుకున్న పని పూర్తి చేశారన్న మాట నిజం. కానీ అది చెయ్యటం లో ఆ క్లిక్ కూడా ఒక వ్యూ లా కౌంట్ అవుతుంది అన్న విషయం మరచిపోయినట్టున్నారు. అంతా కలిసి ఎంత కాదన్న ఒక 100k వ్యూస్ సంఖ్యా పెంచారు.


అంతా కలుపుకుని ఇప్పుడు డీజే టీజర్ టాలీవుడ్ లోనే అతి త్వరగా 7 మిలియన్ వ్యూస్ సాధించిన టీజర్ గా రికార్డు కొట్టింది. దీనితో ఆశ్చర్యపోవటం పవన్ ఫాన్స్ వంతయ్యింది.    ఇప్పుడు 8 .9  మిలియన్ వ్యూస్ దగ్గర ఉన్న కాటంరాయుడు టీజర్ వ్యూస్ పెంచే పని లో పడ్డారు పవన్ ఫాన్స్ మళ్ళి.


నెక్స్ట్ టార్గెట్ 10 మిలియన్ వ్యూస్. చూద్దాం ఎవరు త్వరగా కొడతారో మరి.