డా.రాజశేఖర్ అమ్మ సెంటిమెంట్

Wednesday Nov 01, 2017
Garudavega stills 11 original

డాక్టర్ రాజశేఖర్ ఒకప్పుడు వరుస హిట్స్ తో దూసుకుపోతుండేవారు. కానీ దాదాపు 17 సంవత్సరాలుగా ఎన్ని సినిమాలు చేస్తున్నా ఒక్కటీ హిట్ కావడం లేదు. వరుస ఫ్లాప్స్ తో సతమతమవుతున్న ఆయన పి.ఎస్.వి.గరుడవేగతో శుక్రవారం తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఆయన సినీ కెరీర్ లో అత్యధిక బడ్జెట్ తో అంటే రూ.30 కోట్లు తీసిన సినిమా ఇదే కనుక దీనిపై ఆయన చాలా ఆశలు పెట్టుకొన్నారు. దీనిపైనే ఆయన భవిష్యత్ సినీ కెరీర్ ఆధారపడి ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. 

ఈ సందర్భంగా అయన మీడియాతో చాలా విషయాలే పంచుకొన్నారు. “గతంలో కూడా ఏ సినిమా చేసినా కధను, దర్శకుడిని  నమ్మి చాలా కష్టపడిపనిచేసేవాడిని. కనుక ఎవరైనా సినిమా గురించి అడిగినప్పుడు సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకంతో అదే చెప్పేవాడిని. కానీ ఫలితం అందుకు భిన్నంగా వచ్చేది. ఇప్పుడు కూడా గరుడవేగ కోసం నా సినీ కెరీర్ లో ఎన్నడూ కష్టపడనంతగా కష్టపడ్డాను. దర్శకుడు ప్రవీణ్ సత్తారు ‘బాగుంది సార్..చాలా బాగుంది సార్..’ అంటూనే మళ్ళీ నన్ను తోమి తోమి వదిలిపెట్టేవాడు. ఈ సినిమా పూర్తయిన తరువాత నాకు ఏదో తెలియని సంతృప్తి కలిగింది. 

ఈ సినిమా గురించి మీడియాలో వస్తున్న వార్తలు, విశేషాలను వింటూ మా అమ్మ చాలా మురిసిపోయేది. ఈ సినిమాను తప్పకుండా చూస్తానని పదేపదే నాకు చెపుతుండేది. ఆవిడ సంతోషం, ఆమె దీవెనలతో ఇక నా సినిమాకు తిరుగు ఉండదనిపించేది. నాకు చాలా సంతోషంగా ఉండేది. కానీ నా సినిమా చూడకుండానే మా అమ్మ హటాత్తుగా చనిపోయింది. ఇది నా మనసును చాలా కలచివేసింది. అయితే నా పక్కన ఇప్పుడు అమ్మ లేకపోయినా పైనుండి ఆమె ఆశీర్వచనాలు నాకు అందుతాయని నమ్ముతున్నాను. ఈ సినిమా గురించి ఒక్కటే చెప్పదలచుకొన్నాను. ఇది రోజూ మనం చూస్తున్న రొటీన్ సినిమాలవంటిది మాత్రం కాదు. అది ఎంత గొప్పగా ఉంటుందో మీరే చూస్తారు,” అని అన్నారు.

ఈ సందర్భంగా అయన మరో ఆసక్తికరమైన విషయం కూడా చెప్పారు. తాను 1993లో అల్లరి ప్రియుడు సినిమాకు ఒప్పుకొన్న తరువాత కొన్ని రోజులకు కోలీవుడ్ దర్శకుడు శంకర్ తనకు ‘జంటిల్ మ్యాన్’ సినిమా చేయమని అడిగారని దాని కోసం తనకు 10 లక్షలు అడ్వాన్స్ ఇవ్వడానికి కూడా నిర్మాతలు సిద్దం అయ్యారని, కానీ అప్పటికే అల్లరి ప్రియుడు సినిమాకు కమిట్ అయిపోవడంతో డేట్స్ అడ్జస్ట్ చేయడం కష్టమని దానిని వదులుకొన్నానని డాక్టర్ రాజశేఖర్ చెప్పారు. 

తరువాత దానిని కమల్ హాసన్ చేయడం అది అయన కెరీర్ లో చేసిన గొప్ప చిత్రాలలో ఒకటిగా నిలిచిపోవడం అందరూ చూశారు. అదే..డాక్టర్ రాజశేఖర్ ఆ సినిమా చేసి ఉండి ఉంటే నేడు ఆయన పరిస్థితి మరోలా ఉండేదేమో? ఏమైనప్పటికీ నవంబర్ 3న రిలీజ్ అవుతున్న గరుడవేగతో మళ్ళీ ఫాంలోకి వస్తే అందరికీ సంతోషం. 

ఇది చదివారా? కంగనా..ఏమి రాజసం ఏమి ఠీవి..