బాలకృష్ణకు విలన్ రాజశేఖర్?

Tuesday Oct 31, 2017
Garudavega %283%29 original

మళ్ళీ చాలా రోజుల తరువాత పి.ఎస్.వి గరుడవేగతో వస్తున్న డాక్టర్ రాజశేఖర్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకొన్నారు. అందుకే ఆ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణను ముఖ్యఅతిధిగా ఆహ్వానించారు. ఆ కార్యక్రమంలో డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ, “బాలకృష్ణగారితో కలిసి ఒక్క సినిమా అయినా చెయ్యాలని ఉంది. అందుకు ఆయన కూడా ఓకె చెప్పారు. ఒకవేళ హీరో పాత్రలేకపోయినా బలమైన విలన్ పాత్ర ఉన్నా చేయడానికి నేను సిద్దం. త్వరలోనే నా కోరిక తీరుతుందని ఆశిస్తున్నాను,” అని అన్నారు.

డాక్టర్ రాజశేఖర్, సునీల్ వంటి కొందరు నటులు గతంలో అనేక హిట్స్ ఇచ్చినప్పటికీ నిలద్రొక్కుకోలేకపోతున్నారు. ఒకప్పుడు జగపతిబాబు కూడా ఇటువంటి పరిస్థితే ఎదుర్కొన్నారు. అప్పుడు అయన చాలా తెలివిగా వ్యవహరించి విలన్ పాత్రలు, తన వయసుకు తగ్గ క్యారెక్టర్ పాత్రలు చేయడానికి సిద్దపడ్డారు. అప్పటి నుంచి ఆయన దశ తిరిగిపోయింది. కనుక డాక్టర్ రాజశేఖర్ కూడా విలన్, తన క్యారెక్టర్ పాత్రలు చేయడానికి సిద్దపడితే మంచిదే! ఆయన బాడీ..లాంగ్వేజ్ అన్నీ అందుకు తగ్గట్లుగానే ఉంటాయి కనుక తప్పకుండా క్లిక్ అయ్యే అవకాశాలున్నాయి.   

ఇది చదివారా? ఇంతోటి పాత్రకు అంత బిల్డప్ ఎందుకో?