అప్పుడే మహేష్ సినిమాకి 3 పాటలు రెడీ

Friday Nov 03, 2017
Dsp vpp original

మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అను నేను సినిమా చేస్తున్నారు. దాని తరువాత దర్శకుడు వంశీ పైడిపల్లితో సినిమా చేయబోతున్నారు. అయితే భరత్ అను నేను చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 27న రిలీజ్ చేస్తామని దర్శకనిర్మాతలు ప్రకటించారు కనుక అది పూర్తయితే కానీ మహేష్ బాబు వంశీతో సినిమా మొదలుపెట్టలేరు.

కానీ అప్పుడే ఆ సినిమాకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఆ సినిమా కోసం విదేశాలలో లోకేషన్స్ చూడటానికి వెళ్ళిన దర్శకుడు వంశీ పైడిపల్లి, ఆ సినిమాకు సంగీతం అందించబోతున్న దేవిశ్రీ ప్రసాద్ ను కూడా వెంటబెట్టుకొని వెళ్లి న్యూయార్క్ లో మ్యూజిక్ సిట్టింగ్స్ చేయడంతో, ఇప్పటికి మూడు పాటలకు ట్యూన్స్ సిద్దం అయిపోయాయని తాజా సమాచారం. వారు ఇదే స్పీడుతో పనులన్నీ చక్కబెట్టగలిగితే, బహుశః జనవరి నాటికే ప్రీ-ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయి షూటింగ్ కు సిద్దంగా ఉంటారేమో? దిల్ రాజు, అశ్వినీ దత్ కలిసి నిర్మించబోతున్న ఈ సినిమాకు పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫి చేస్తారు.  

ఇది చదివారా? పి.ఎస్‌.వి.గ‌రుడ‌వేగ 126.18 ఎమ్: రివ్యూ