పోస్టర్ కే ఫిదా అయిపోవచ్చు

Friday Jun 16, 2017
2805482253933765301 account id 2 original

శేఖర్ కమ్ముల దర్శకత్వం లో వరుణ్ తేజ్ హీరో గ తెరకెక్కుతున్న సినిమా ఫిదా. మలయాళ సినిమా అయినా ప్రేమమ్ తో ఇండియా అంతటా పేరు సంపాదించినా సాయి పల్లవి ఈ చిత్రం లో తెలుగు లో తెరంగ్రేటం చేయనుంది. శేఖర్ కమ్ముల చాల రోజుల తర్వాత ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు, వరుణ్ తేజ్ చివరి రెండు సినిమా లు ప్లాప్ కావడం తో ఈ సినిమా తో తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే ఈ కాంబినేషన్ పై మంచి అంచనాలు నెలకొన్న తరుణం లో రేపు ఈ సినిమా టీజర్ విడుదల చేయనున్నారు. ఈ సందర్బంగా ఒక పోస్టర్ విడుదల చేసారు. హీరో హీరోయిన్ ఇద్దరు ఉయ్యాలా పై కూర్చుని ఉండగా సాయి పల్లవి తన చేతి గోరింటాకు ను వరుణ్ తేజ్ కు చూపిస్తున్నట్లు ఈ పోస్టర్ డిజైన్ చేసారు. టైటిల్ కు ట్యాగ్ లైన్ గ లవ్-హేట్-లవ్ స్టోరీ అని పెట్టారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.