‘అదిరింది’ రిలీజ్ వాయిదా

Friday Oct 27, 2017
Adhirindhi original

మొన్న దీపావళికి రిలీజ్ అయ్యి తమిళంలో సూపర్ హిట్ అయిన మెర్సల్ సినిమా తెలుగులో ‘అదిరింది’ పేరుతో ఇవ్వాళ్ళ విడుదల కావలసి ఉంది. కానీ ఆ సినిమాలో జి.ఎస్.టి.పై వేసిన పంచ్ డైలాగుల కారణంగా తమిళనాడులో జరుగుతున్న రాద్దాంతం చూసిన తరువాత, తెలుగు వెర్షన్ లో వాటిని తొలగించాలని సెన్సార్ బోర్డు నిర్మాత శరత్ మరార్ ను కోరింది. అయితే అది డబ్బింగ్ సినిమా అయినందున వాటిని ఆయన తొలగించలేరు కానీ తప్పనిసరయితే ఆ డైలాగ్స్ వచ్చినప్పుడు ‘బీప్ సౌండ్’ పెట్టవచ్చు. కానీ ఆవిధంగా చేస్తే తమిళ వెర్షన్ లో ఉన్న పవర్ తెలుగు వెర్షన్ లో ఉండదని దర్శకనిర్మాతలు సంకోచిస్తున్నారు. కనుక ఈ జి.ఎస్.టి. డైలాగుల సంగతేదో తేలితే కానీ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ రాదు. కనుక ఈరోజు విడుదల కావలసిన ‘అదిరింది’ చిత్రం వాయిదా పడింది. తమిళంలో ఈ సినిమా విడుదలై ఇప్పటికే వారం రోజులైపోయింది కనుక వీలైంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించుకొని త్వరలోనే విడుదలచేయాలని నిర్మాత శరత్ మరార్ తొందరపడుతున్నారు.

ఈ సినిమాలో సమంత, కాజల్, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటించారు. స్పైడర్ చిత్రంలో విలన్ పాత్రలో మెప్పించిన ఎస్.జె.సూర్య ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర చేశాడు. అత్లీ దర్శకత్వంలో నార్త్ స్టార్ ఎంటర్ టైన్ బేనర్ లో రూపొందిన ఈ సినిమాకు కధ: విజయేంద్ర ప్రసాద్, సంగీతం: ఏఆర్ రహమాన్ అందించారు. 

ఇది చదివారా? PSV Garuda Vega censored