హలో.....కనపడట్లేదేంటి?

Wednesday Nov 29, 2017
Akhil2 hello teaser views original

హలో.....కనపడట్లేదేంటి?

అఖిల్ అక్కినేని హలో సినిమా టీజర్ కోసం వెతికే జనాలు ఇప్పుడే ఇదే అనుకుంటున్నారు. యూట్యూబ్ లో 5 మిలియన్  వ్యూస్ దాటేసిన ఈ టీజర్ ని ఇప్పుడు చూద్దామంటే కాపీరైట్ ఇష్యూ అని కనిపించటం తో అవాక్కవటం ఫాన్స్ వంతయ్యింది.

విషయానికి వస్తే అఖిల్ అక్కినేని నటించిన హలో టీజర్ లో సంగీతం తమదే అని ఒక సంస్థ అప్పీల్ చెయ్యటం తో యూట్యూబ్లో  ఆ టీజర్ ని హోల్డ్ లో పెట్టటం జరిగింది. మరి ఇంత చూస్కోకుండా అంత పెద్ద సినిమా టీజర్ రిలీజ్ చేసేసారు అనుకోకండి. ఆ సంగీతం వాడుకోటానికి కావాల్సిన అమౌంట్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ఫలానా సంస్థ కి చెల్లిచటం జరిగింది. కానీ ఎందువలనో ఏమో కానీ వారు ఇది డబ్బులు చెల్లించకుండా వాడేసుకున్నారని అనుకోటం తో యూట్యూబ్ వారు తమ పని తాము చేసారు.

ఇప్పుడు అన్నపూర్ణ సంస్థ వారు ఇందులో ఇన్వొల్వె అవుతుండటం తో ఏ క్షణం లో ఐనా ఆ టీజర్ మళ్ళి ఆక్టివ్ అవ్వటం ఖాయం. కానీ ఇటువంటి వాటిని సరదా కి తీసుకునే మన సోషల్ వీరులు ఆల్రెడీ ట్రోల్ పేజెస్ ని ఈ విషయం తో నింపేసే పని లో ఉన్నారు.