గ్లామర్ షోకు నేను రెడీ

Saturday Oct 28, 2017
Anupama parameswaran original

టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న అందాలభామ అనుపమ పరమేశ్వరన్. తెలుగులో ఆమె ‘అ..ఆ..’, ‘ప్రేమమ్’, ‘శతమానం భవతి’, నిన్న విడుదలైన ‘ఉన్నదీ ఒక్కటే జిందగీ’ చిత్రాలలో నటించింది. ఆన్నీ కూడా హిట్ అయ్యాయి. వాటిలో ఆమె నటనకు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంశలు అందుకొంటోంది కూడా. ఇవి కాక ఇంకా నానితో కృష్ణార్జున యుద్ధంలో నటిస్తోంది. కరుణాకరన్ దర్శకత్వంలో మరో సినిమాకు కూడా ఓకె చెప్పేసింది. అంటే అనుపమ కెరీర్ జోరందుకొన్నట్లేనని అర్ధం అవుతోంది. ఈ పరిస్థితిలో ఆమె పొట్టి దుస్తులు, బికినీలు వేసుకొని గ్లామర్ షోలు చేయనవసరం లేదు. కానీ ఆమె వాటికి సై అంటోంది.

ఆమె మీడియాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే కాకుండా అవసరమైతే గ్లామర్ షోలు చేయడం కూడా చాలా అవసరం అని స్పష్టం చేసింది.  నాలుగైదు సినిమాలు చేయగానే అప్పుడే సినీ పరిశ్రమను అప్పుడే కాచివడబోసినట్లు అనుపమ మాట్లాడటం విశేషమే. సినీ పరిశ్రమలో హీరోయిన్లకు ‘షెల్ఫ్ లైఫ్’ చాలా తక్కువనే విషయం ఆమె త్వరగానే గ్రహించినట్లుంది. అందుకే గ్లామర్ షోలు చేయడానికి కూడా వెనుకాడనని తేల్చి చెప్పింది. ఆమె రెడీ అంటోంది కనుక ఇక దర్శకనిర్మాతలదే ఆలస్యం.

ఇది చదివారా?  ఆ స్టేజ్ ఎప్పుడో దాటేశాను: రజనీ