మలయాళం సినిమాలే బెస్ట్: అనుష్క

Wednesday Nov 01, 2017
Maxresdefault %281%29 original

మన బాహుబలి హీరోయిన్ అనుష్క కర్నాటకకు చెందినప్పటికీ ఆమెను తెలుగు ప్రేక్షకులకు ఇంటి ఆడపడుచుగా భావిస్తుంటారు. ఆమెకు, తెలుగు ప్రేక్షకులకు అంతగా అనుబందం పెనవేసుకుపోయింది. ఆమె ప్రభాస్ ను వివాహం చేసుకొని తెలుగింటి ఆడపడచు కాబోతోందని ఆ మద్యన మీడియాలో జోరుగా వార్తలు వచ్చాయి. ఆమె తెలుగుతో బాటు తమిళ సినిమాలు కూడా చేస్తున్నప్పటికీ, తెలుగు సినీ పరిశ్రమనే అంటిపెట్టుకొని ఉన్నారు. ప్రతీ సినిమాలో తన నటన, అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకొంటూనే ఉన్నారు.  అందుకే ఆమె నటించిన సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా తెలుగులో వరుసపెట్టి ఆఫర్లు వస్తూనే ఉంటాయి ఆమెకు.

ఆమె మొన్న మీడియాతో మాట్లాడుతూ సినీపరిశ్రమ గురించి తన మనసులో అబిప్రాయం, తన కోరికను బయటపెట్టారు. భారతీయ సినీ పరిశ్రమలో కధాపరంగా మంచి సినిమాలను నిర్మించడంలో మలయాళ చిత్ర పరిశ్రమ అత్యంత పరిపక్వత కలిగిందని, ఏనాటికైనా దాని వలనే భారతీయ సినీ పరిశ్రమ గర్వంగా తలెత్తుకొని నిలబడే రోజు వస్తుందని తన తండ్రి ఒకసారి తనతో అన్నారని అనుష్క చెప్పారు. సినీ పరిశ్రమలోకి ప్రవేశించి సినిమాలు చేయడం మొదలుపెట్టిన తరువాత తన తండ్రి చెప్పిన మాట నిజమేనని తనకు అర్ధం అయ్యిందని అన్నారు. కనుక ఎప్పటికైనా మళయాళ సినిమాలలో నటించాలని ఉందని అనుష్క చెప్పారు. ఒకవేళ మళయాళ సినిమాలో నటించే అవకాశం వస్తే కేవలం కధ స్క్రిప్ట్ మాత్రమే చూస్తానని, మిగిలిన విషయాలు పట్టించుకొన్ని అనుష్క అన్నారు.

అంతర్జాతీయ స్థాయిలో నిర్మించిన బాహుబలి సినిమాలో హీరోయిన్ గా నటించిన అనుష్క ఈవిధంగా చెప్పడం విచిత్రంగానే అనిపించవచ్చు. తెలుగు ప్రేక్షకులు ఆమె మాటలకు నొచ్చుకొన్నా ఆశ్చర్యం లేదు. అయితే మళయాళ సినీ పరిశ్రమ గురించి ఆమె చెప్పినమాటలు అక్షరాల సత్యం అని తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖులు సైతం అంగీకరిస్తారు. దృశ్యం వంటి మంచి కదాబలం ఉన్న సినిమాలు మలయాళంలో అనేకం ఉన్నాయి. వాటినే తెలుగు, తమిళ, హిందీ బాషలలో రీమేక్ చేయడం అందరూ చూస్తూనే ఉన్నారు. ఒకప్పుడు మలయాళం సినిమాలంటే ‘సాఫ్ట్ పోర్న్’ సినిమాలని పేరుండేది. కానీ ఆ తరువాత మలయాళ సినీ పరిశ్రమలో దేశావిదేశాలు సైతం గుర్తించే స్థాయిగల అనేక మంచి సినిమాలు వచ్చాయి ఇంకా వస్తూనే ఉన్నాయి. అక్కడి ప్రేక్షకులు కమర్షియల్ ఫార్ములా సినిమాల కంటే మంచి కదాబలం ఉన్న సినిమాలనే ఎక్కువగా ఆదరిస్తుంటారు. ఆ కారణంగా ఎక్కువగా అటువంటి సినిమాలే వస్తుంటాయి. కనుక అటువంటి మంచి చిత్రాలలో చేసి ఇంకా మంచి గుర్తింపు సంపాదించుకోవాలని అనుష్క కోరుకోవడం సహజమే. 

ఇది చదివారా?  చంద్రబాబు పెళ్ళి ఫోటో: వర్మ సినిమా మెటీరియల్!