అర్జున్ లుక్ అదిరిపోయింది

Friday Jul 07, 2017
Arjun look in nithin lie movie 1499405669 180 original

అ..ఆ తో హిట్ కొట్టి తర్వాత చాలా గ్యాప్ తర్వాత నితిన్ చేస్తున్న చిత్రం లై . ఈ చిత్రానికి అందాల రాక్షసి, కృష్ణ గాడి వీర ప్రేమ గాథ సినిమాలను తీసిన దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వం వహించనున్నాడు. ఇందులో లై అనే టైటిల్ లో ని ఒక్కో అక్షరానికి ఒక్కో అర్థం ఉన్నట్లు ఇప్పటికే చిత్ర బృందం తెలిపింది. ఎల్ అంటే లవ్...ఐ అంటే ఇంటలిజెన్స్...ఏ ఇంతే ఎనిమిటి అని చెప్పారు. అయితే ఇందులో ఒక్కో అక్షరానికి ఒక్కో పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు. లవ్ పోస్టర్ ను ఇప్పటికే రిలీజ్ చేయగా ఇపుడు సరికొత్తగా ఇంటలిజెన్స్ కు సంబందించిన పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పోస్టర్ లో అర్జున్ చాల సీరియస్ అండ్ రిచ్ లుక్ తో కనిపించారు. ఈ సినిమా లో అర్జున్ ఒక కీలక పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి పోస్టర్ తో పాటు సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఈ సినిమా ఆగస్ట్11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అంద్రిస్తున్నారు. ఈ సినిమా లో కథానాయిక గా మేఘ ఆకాష్ నటిస్తోంది.