అందుకే అదిరింది రిలీజ్ కాలేదా?

Monday Nov 06, 2017
Vijay in adhirindhi original

తమిళంలో సూపర్ హిట్ అయిన విజయ్ నటించిన మెర్సల్ సినిమాను తెలుగులో ‘అదిరింది’ పేరుతో డబ్ చేసి విడుదల చేయాలనుకొన్నారు నిర్మాత శరత్ మరార్. కానీ దానిలో జి.ఎస్.టి.పై ఉన్న డైలాగుల కారణంగా తమిళనాడులో పెద్ద వివాదం జరుగుతునందున, తెలుగులో దానికి క్లియరెన్స్ ఇవ్వడానికి   సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పడంతో ఆ సినిమా రిలీజ్ చివరి నిమిషంలో నిలిచిపోయింది. తరువాత ఆ సమస్య పరిష్కారం అయ్యిందని త్వరలో సినిమా విడుదల కాబోతోందని మళ్ళీ టాక్ వినిపించింది కానీ నేటికీ సినిమా రిలీజ్ కాలేదు. అది ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయం చెప్పడానికి నిర్మాత శరత్ మరార్ కూడా మీడియా ముందుకు రావడం లేదు. కనుక అది ప్రస్తుతానికి ఆగిపోయినట్లే భావించవచ్చు. 

అయితే అది సెన్సార్ అభ్యంతరాల వలన ఆగిపోలేదు..ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ దానిని తెలుగులో రీమేక్ చేయాలని నిర్ణయించుకొన్నారని, ఆయన అభ్యర్ధన మేరకే శరత్ మరార్ ఆ సినిమాను రిలీజ్ చేయకుండా నిలిపి వేశారని టాక్ వినిపిస్తోంది. అందుకు ఆయనకు నష్టపరిహారం చెల్లించి, తెలుగులో రీమేక్ రైట్స్ కోసం మెర్సల్ నిర్మాతలకు అల్లు అరవింద్ అధనంగా డబ్బు చెల్లించారని ఇండస్ట్రీలో టాక్. అది నిజమో కాదో తెలియాలంటే, మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఒకవేళ ఈలోగా ‘అదిరింది’ రిలీజ్ అయిపోతే, ఇవి వట్టి పుకార్లేనని అర్ధం అవుతుంది లేకుంటే,  మద్యలో ఎంట్రీ ఇచ్చి అల్లు అరవిందే అదరగొట్టేశారని భావించవచ్చు. 

ఇది చదివారా? ‘అదిరింది’ రిలీజ్ వాయిదా