బిగ్ బాస్ -2 మసాలా ఉంది అంటారా ?

Tuesday Jun 12, 2018
Big boss telugu 2 original

బిగ్ బాస్ -2 మసాలా ఉంది అంటారా ?

అత్యధిక TRP తో తెలుగు రియాలిటీ షోస్ రికార్డులను తిరగరాసిన షో బిగ్ బాస్ సీజన్ 1  . పైగా తెలుగులో ఈ మధ్య కాలంలో వచ్చిన రియాలిటీ షోస్ లో బిగ్ బాస్ -1  అతి పెద్ద సక్సెస్ అని  చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.  అలాంటి   బిగ్ బాస్ షో సీజన్ -2 మొదలు అవుతుంది అంటే ప్రేక్షకుల అంచనాలు ఆకాశాన్ని దాటిపోతాయి అని అందరికి తెలిసిన విషయమే. అయితే సీజన్ -1 లో మెయిన్ అట్రాక్షన్ Jr NTR , తన హావ భావాలతో , తన వాక్చాతుర్యం తో బిగ్ బాస్ షో ని తన భుజాల మీద మోశాడు. 

బిగ్ బాస్ సీజన్ -2 కంటెస్టెంట్స్ ఎంపిక లో బిగ్ బాస్ బృందం అంతగా సఫలీకృతం అవ్వలేదు అని చెప్పాల్సిన పరిస్థితి. బిగ్ బాస్ -2 కాంటెస్టునంట్స్ లో ఒకరు ఇద్దరు మినహా మిగితా వాళ్ళు  అవకాశాలు లేక ఎదో బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న సెలబ్రిటీస్ లానే కనిపిస్తున్నారు. ఈ సారి సామాన్యులు బిగ్ బాస్ షోలో అవకాశం కొత్తదనం లో చూపించారు కానీ, అది కూడా యే మేరకు సక్సెస్ తీసుకొస్తుందో చూడాలి. 

ఇప్పుడు సీజన్ -2  యాంకర్ గా ఎన్టీఆర్ స్థానంలో నాచురల్ స్టార్  నాని వచ్చాడు. ఎన్టీఆర్  లా  నాని షో ని క్యారి చేయగలడా , ఎన్టీఆర్ లా ప్రేక్షకులను మెస్మరైజ్ చేయగలడా అన్నది వేచి చూడాలి. నాని టాగ్ లైన్ " బాబాయ్ ఇంకొంచెం మసాలా " వినడానికి బానే ఉన్నా .. అసలు రుచికరమైన మసాలా నా?  లేక కళ్ళలో నుండి నీళ్లు తెప్పించే మసాలా నా అన్నది కాలం చెప్తుంది.

By - Abhilash J