చైతు..శైలజా రెడ్డి అల్లుడా?

Saturday Oct 28, 2017
Chaitu samantha original

అక్కినేని హీరో నాగ చైతన్య ఈనెల 6వ తేదీన తన అందాల ప్రేయసి సమంతను పెద్దల సమక్షంలో గోవాలో పెళ్ళి చేసుకొన్న సంగతి అందరికీ తెలిసిందే. కనుక సమంత తల్లి అతనికి అత్తగారు అయ్యారు. కానీ అతను ‘శైలజా రెడ్డి అల్లుడు’ అని దర్శకుడు మారుతి అంటున్నాడుట. అంటే చైతుతో చేయబోయే సినిమాకి ‘శైలజా రెడ్డి అల్లుడు’ అని పేరు పెట్టబోతున్నట్లు అర్ధం. ఈ సినిమాను తెరకెక్కించబోతున్న సితార ఎంటర్టెయిన్మెంట్స్ సంస్థ ఈ పేరును ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించడంతో అదే ఈ సినిమా పేరు కావచ్చని అందరూ భావిస్తున్నారు. అయితే దీనిని దర్శకుడు మారుతి అధికారికంగా ప్రకటించవలసి ఉంది. ఈ టైటిల్ చాలా వెరైటీగా క్యాచీగా ఉంది.

నాగ చైతన్య చందు మొండేటి దర్శకత్వంలో ‘సవ్యసాచి’ అనే మరో సినిమాకు కూడా మొదలుపెట్టబోతున్నాడు. ముందుగా మారుతి దర్శకత్వంలో సినిమానే మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.    

ఇది చదివారా?  అవన్నీనిజం కాదు: వంశీ పైడిపల్లి