రాజుగారి గదిని ఇద్దరూ పట్టించుకోలేదు..ఏమవుతుందో ఏమో?

Thursday Oct 12, 2017
Raju gari gadhi 2 original

నాగార్జున, సమంత ప్రధానపాత్రలు పోషించిన ‘రాజుగారి గది-2’ రేపు అంటే శుక్రవారం రిలీజ్ కాబోతోంది. సాధారణంగా ఆత్మలు, దెయ్యాలు ఉండే హర్రర్ సినిమాలు హిట్ అవడం చాలా కష్టం. అందుకే నాగార్జున తన కొడుకు పెళ్ళికి గోవా బయలుదేరే ముందు మీడియా సమావేశం పెట్టి “నాకు కూడా దెయ్యాలు..భూతాలు ఉండే హర్రర్ సినిమాలు అంటే ఇష్టం ఉండదు కానీ ఇది ఒక చక్కటి ఫ్యామిలీ సినిమా. అందుకే చేశాను. దీనికి సెన్సార్ బోర్డు క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు. కుటుంబసమేతంగా అందరూ కలిసి రాజుగారి గదిని చూసి ఆనందించవచ్చు,” అని చెప్పారు.

అయినా అటువంటి సినిమాకు జనాలను రప్పించాలంటే మామూలు సినిమాల కంటే కాస్త గట్టిగానే ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం చాలా అవసరం. కానీ నాగ చైతన్య, సమంతల పెళ్ళి హడావుడి కారణంగా ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను పక్కనపెట్టక తప్పలేదు. గత రెండు మూడు వారాలుగా మీడియాలో వారిరువురి పెళ్ళి ముచ్చట్లే ఎక్కువగా వినబడ్డాయి తప్ప ‘రాజుగారి గది’ ముచ్చట్లు పెద్దగా వినబడలేదు. పెళ్ళి వేడుకలు ముగించుకొని గోవా నుంచి తిరిగి వచ్చిన తరువాతైనా నాగార్జున, సమంతలు ‘రాజుగారి గది’ గురించి మీడియాతో మాట్లాడలేకపోయారు. కనుక ఎటువంటి గట్టి ప్రచారం లేకుండానే సినిమా రేపు రిలీజ్ అయిపోతోంది. అదే..ఇద్దరూ కాస్త ప్రచారం చేసి ఉంది ఉంటే కనీసం ఓపెనింగ్స్ బారీగా వచ్చి ఉండేవి. నాగార్జున చెప్పినట్లు ఒకవేళ నిజంగా ఆ సినిమాలో అంత దమ్ముంటే తప్పకుండా ఆడుతుంది లేకుంటే కష్టమే.