'జై లవ కుశ' టీజర్ రివ్యూ

Thursday Jul 06, 2017
Jai teaser original

ఎంతో కాలంగా జనాలు ఎదురు చూస్తున్న జై లవ కుశ టీజర్ ఇవాళ సాయంత్రం చెప్పినట్లు గానే 5:22 కు విడుదల చేశారు.ఈ సినిమా లో ఎన్టీఆర్ తన కెరీర్లో మొదటి సారిగా త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఇందుకు తగ్గట్టుగానే ఏ సినిమాకు లేనట్లుగా ఈ సినిమా కు మూడు టీజర్ లు విడుదల చేయనున్నారు. ఒక్కో టీజర్ లో ఎన్టీఆర్ ఒక్కో పాత్రను రివీల్ చేస్తున్నారు. ఇవాళ విడుదల అయినా టీజర్ లో ఎన్టీఆర్ జై పాత్రను రివీల్ చేశారు. టీజర్ చుస్తే ఎన్టీఆర్ ఈ పాత్రలో విలన్ గా చేస్తున్నారని అర్థం అవుతుంది. చెవికి పోగు, చేతికి సంకెళ్లు, కన్నింగ్ చూపులు,చేతిలో ఆయుధం, భయంకరమైన నవ్వు, కొమ్ముల కుర్చీ తో కూడిన సెట్ ఇవన్నీ చుస్తే ఎన్టీఆర్ విలనిజం ఏ రేంజ్ లో ఉందొ అర్థం అవుతుంది. ఇక డైలాగ్ డెలివరీ విషయానికి వస్తే టీజర్ లో చూపించిన ఒక్క డైలాగ్ అదిరిపోయింది. ఎన్టీఆర్ తనను రావణాసురిడితో పోల్చుకుంటూ నత్తితో చెప్పే డైలాగ్ వింటే రోమాలు నిక్కపొడుచుకోవడం ఖాయం. నత్తితో కూడా ఆ రేంజ్ డైలాగ్ డెలివరీ ఎన్టీఆర్ కే సాధ్యం అనడంలో అతిశయోక్తి లేదు. నిర్మాణ విలువలు కూడా బావున్నాయి. చోట కే నాయుడు కెమెరా వర్క్ కూడా చాలా బావుంది.ఈ చిత్రానికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నాడు. బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై కళ్యాణ్ రామ్ ఈ సినిమా ను నిర్మిస్తున్నాడు.