జై లవకుశ సరికొత్త రికార్డు

Tuesday Sep 12, 2017
Jai lavakusa original

జై లవకుశ మరో సరికొత్త రికార్డు సృష్టించింది. ఆదివారం విడుదలైన జై లవకుశ ట్రైలర్ ను 24 గంటల వ్యవధిలో ఏకంగా 60 లక్షల మంది చూశారు. మొత్తంగా 24 గంటలలో 70.54 లక్షల డిజిటల్ వ్యూస్ సాధించింది. ఇది తెలుగు సినీ చరిత్రలో సరికొత్త రికార్డని చెప్పవచ్చు. ట్రైలర్ కు వస్తున్న స్పందనను బట్టి ఆ సినిమా సూపర్ హిట్ కాబోతోందని స్పష్టం అవుతోంది. ఆ సినిమాలో ఎన్టీఆర్ చేసిన జై, లవ కుమార్, కుశ అనే మూడు పాత్రలలో అన్నిటికంటే ఎక్కువగా నెగెటివ్ షేడ్స్ కనిపిస్తున్న జై పాత్రకే అందరూ ఆకర్షితులవుతున్నారు. ఆ పాత్రలో ఎన్టీఆర్ తన విశ్వరూపం చూపించడమే అందుకు కారణం. ఏమినప్పటికీ ఈ సినిమా..దానిలో జై పాత్ర ఎన్టీఆర్ సినీ జీవితంలో మరొక మైలురాయిగా నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాలో నివేద థామస్, రాశి ఖన్నా హీరోయిన్లుగా చేశారు. బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్ పతాకంలో నందమూరి కళ్యాణ్ రాం నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు. సెప్టెంబర్ 21న జై లవకుశ విడుదల కాబోతోంది.