పాత కాంబినేషన్ తో రానున్న కాజల్...

Thursday Jun 08, 2017
Kajal and kalyan ram for mla b 0506170511 original

ఇజం సినిమా తో పర్వాలేదనిపించుకున్న కళ్యాణ్ రామ్ మరో సినిమా తో రెడీగా ఉన్నాడు. ఆ సినిమా కి టైటిల్ 'ఎం.ఎల్.ఎ.(మంచి లక్షణాలున్న అబ్బాయి)' అని ఫిక్స్ చేసారు. ఉపేంద్ర మాధవ్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నారు. ఎపుడు కొత్త హీరోయిన్లను పరిచయం చేసే నందమూరి కళ్యాణ్ రామ్ ఈసారి కాజల్ ఈ సినిమా లో తనకు కథానాయికగా ఉండాలని కోరుకుంటున్నారంట.2007  లో వచ్చిన ' లక్ష్మి కళ్యాణం' లో వీరిద్దరి జంట చూడముచ్చటగా ఉండి మంచి హిట్ అందుకుంది. ప్రస్తుతం రానా తో 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా లో నటిస్తూ కాజల్ బిజీ గా ఉంది. ఒకవేళ అన్ని అనుకున్నట్లు అయితే  ఈ జంట మళ్ళీ కనువిందు చేయనుంది.