కంగనా..ఏమి రాజసం ఏమి ఠీవి..

Wednesday Nov 01, 2017
Kangana ranaut manikarnika original

ఏక్ నిరంజన్ సినిమాలో ప్రభాస్ కు హీరోయిన్ గా చేసిన కంగనా రనౌత్ గుర్తుందా? ఆమెతో దర్శకుడు క్రిష్ (రూప సింగ్) ‘మణికర్ణిక: ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ అనే హిందీ సినిమా తీస్తున్నాడు. ఝాన్సీ లక్ష్మీ భాయ్ జీవితకధ ఆధారంగా రూపొందుతున్న మనికర్ణికలో కంగనా రనౌత్ ఝాన్సీ లక్ష్మీభాయ్ పాత్ర చేస్తోంది.

ఈ సినిమాలో హిందీ టీవి నటి అంకిత లోఖాండే ఝాల్ఖారీ భాయ్ పాత్ర చేస్తోంది. ఝాన్సీ లక్ష్మీ భాయ్ సైన్యంలో ఝాల్ఖారీ భాయ్ ఒక ముఖ్య సైనికురాలు, బ్రిటిష్ వారితో జరిగిన ఒక యుద్ధంలో ఆమె ఝాన్సీ లక్ష్మీ భాయ్ వేషంలో పోరాడింది.

ప్రస్తుతం రాజస్తాన్ లో జైపూర్ లో వేసిన ఒక ప్రత్యేక సెట్ లో మొన్న మంగళవారం వరకు రెగ్యులర్ షూటింగ్ జరిగింది. జైపూర్ షెడ్యూల్ తరువాత షెడ్యూల్ జోద్ పూర్ లో తరువాత షెడ్యూల్ మొదలుపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా ఝాన్సీ లక్ష్మీభాయ్ వేషధారణలో కంగనా రనౌత్ ఫోటోలు సినీబృందం మీడియాకు విడుదల చేసింది. ఆ దుస్తులలో ఆమె రాజసం ఉట్టిపడుతూ అద్భుతంగా ఉంది. ఆ ఫోటోలను చూస్తుంటే అలనాడు ఝాన్సీ లక్ష్మీభాయ్ ఇలాగే ఉండేదా..అన్నంత గొప్పగా ఉన్నాయి. ఆ ఫోటోలను మీరు చూడండి.

ఈ సినిమాలో సోనూ సూద్ ఒక ప్రధానపాత్ర చేస్తున్నాడు.

నిర్మాతలు కమల్ జైన్, నిశాంత్ పిట్టి కలిసి జీ స్టూడియోస్ మరియు కైరోస్ కాంటినెంట్ స్టూడియోస్ బ్యానర్ లో ఈ సినిమాను హిందీలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాను మొదట హిందీలో తీసి తరువాత తెలుగు, తమిళ బాషలలో డబ్ చేసి విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.  

ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కధ అందించారు. ఈ సినిమాకు కెమెరా: జ్ఞాన శేఖర్, ఆర్. రత్నవేలు, సంగీతం: శంకర్-ఎహసాన్-లాయ్ అందిస్తున్నారు. ఈ సినిమాను 2018, ఏప్రిల్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. 

ఇది చదివారా? మా మద్య అటువంటిదేమీ లేదు: మేఘ