కార్తి, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా
నటించిన ‘ఖాకి’ చిత్రం ఆడియో గురువారం హైదరాబాద్ లో విడుదల చేశారు. హెచ్.వినోద్
దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఉమేష్ గుప్తా, సుబాష్ గుప్తాలు నిర్మించారు. ఈ
సినిమాకు ఇచ్చిన ‘పవర్ ఆఫ్ పోలీస్’ అని సబ్-టైటిల్, ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ను
చూసినట్లయితే ఇది పూర్తిగా పోలీస్-మార్క్ యాక్షన్ ఫిలిం అని అర్ధమవుతూనే ఉంది.
రాజకీయ నాయకులు-పోలీసులు-సమాజం ఇతివృత్తంగా ఇప్పటికే అనేకవందల సినిమాలు వచ్చాయి.
కనుక ఈ సినిమా వాటికి ఏవిధంగా భిన్నమైనదో చూడాలంటే ఈనెల 17వరకు ఆగాల్సిందే. ఇది
1995లో జరిగిన కొన్ని నిజజీవిత ఘటనల ఆధారంగా తయారుచేసుకొన్న కధ అని దర్శకుడు
వినోద్ చెప్పారు. రన్రాజా రన్, బాబు బంగారం, హైపర్ సినిమాలకు సంగీతం అందించిన జిబ్రాన్ ఈ సినిమాకు సంగీతం
అందించారు.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు తొలి సీడిని
ఆవిష్కరించిన తరువాత మాట్లాడుతూ “ఊపిరి సినిమాతో కార్తి తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యారు.
కనుక ఏడాదికి కనీసం ఒక్క స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తే బాగుంటుంది,” అని
అన్నారు. దానికి కార్తి సానుకూలంగా స్పందిస్తూ, ‘ఎవరైనా మంచి కధతో వస్తే ఏను
తప్పకుండా తెలుగులో సినిమాలు చేయడానికి కూడా సిద్దంగా ఉన్నాను,’ అని జవాబు
చెప్పారు.
ఇది చదివారా? 24న వస్తున్న బాలకృష్ణుడు