ఆ ఇద్దరు దర్శకులకు లక్ష్మీ పార్వతి వార్నింగ్

Monday Oct 30, 2017
Lakshmi's ntr veera grandham movies original

తెలుగు సినీ పరిశ్రమలో మొట్టమొదటిసారిగా ఒకేసారి ఒకే వ్యక్తి జీవితకద ఆధారంగా మూడు బయోపిక్స్ తెరకెక్కబోతున్నాయి. అవే..రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి డైరెక్షన్ లో ‘లక్ష్మీస్ వీరగ్రందం, తేజ డైరెక్షన్ లో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించబోతున్న చిత్రం.

వీటిలో వర్మ తీయబోతున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పై లక్ష్మీ పార్వతి మొదట ఎటువంటి అభ్యంతరాలు చెప్పలేదు. అది మంచి ఆలోచనే అన్నట్లు మాట్లాడారు. కానీ ఎప్పుడైతే ‘లక్ష్మీస్ వీరగ్రందం’ సినిమా పోస్టర్, ప్రకటన వెలువడిందో అప్పటి నుంచి ఆమె చాలా ఆందోళన మొదలైంది. కారణాలు అందరికీ తెలిసినవే.

ఈ మూడు సినిమాలపై ఆమె స్పందిస్తూ, “లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో చరిత్రకు తెలియని విషయాలను చూపిస్తానని రామ్ గోపాల్ వర్మ చెబుతున్నాడు కాబట్టే నేను దానికి అంగీకరిస్తున్నాను. ఆయన నిజంగా చరిత్రకు దొరకని మరుగునపడిన విషయాలను చూపిస్తే చాలా సంతోషిస్తాను. అయితే నా ఆత్మగౌరవానికి భంగం కలిగే విధంగా సినిమా తీస్తే సహించబోను. అయన ఇంతవరకు నన్ను కలవలేదు. ఆ సినిమా గురించి నాతో మాట్లాడలేదు. నా పేరుపెట్టి మా జీవితకధను ఎవరు సినిమాగా తీయాలనుకొన్నా వారు తప్పనిసరిగా నా అనుమతి తీసుకోవలసి ఉంటుంది. నా అనుమతి తీసుకోకుండా ఎవరిష్టం వచ్చినట్లు వారు సినిమాలు తీసి చరిత్రను వక్రీకరిస్తే న్యాయస్థానానికి వెళ్లి అడ్డుకొంటాను. ఇది ఇతరులకు కూడా వర్తిస్తుంది,” అని హెచ్చరించారు.  

ఇది చదివారా? ఛలో ఫస్ట్-లుక్ పోస్టర్ వెరీ నైస్