లక్ష్మీస్ వీరగ్రంధం స్క్రిప్టుకి పూజలు

Saturday Nov 04, 2017
Lakshmi's veera grandham script original

ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కబోతున్న మూడు సినిమాలలో దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తీయబోతున్న ‘లక్ష్మీ’స్ వీరగ్రంధం’ మొట్టమొదటగా షూటింగ్ ప్రారంభించబోతోంది కనుక అదే మొదట విడుదలకాబోతోంది. ఆ సినిమా దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి శనివారం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని స్వామివారి ముందు ఆ సినిమా స్క్రిప్ట్ ను ఉంచి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టి వచ్చే ఏడాది మార్చిలోగా విడుదల చేస్తాము. మా ఈ సినిమాకు ఎటువంటి ఆటంకాలు ఎదురుకాకుండా విజయవంతంగా పూర్తవ్వాలని, రిలీజ్ అయిన తరువాత విజయవంతంగా ఆడాలని ఆ భగవంతుని కోరుకొన్నాను,” అని చెప్పారు.

తన పేరు పెట్టి తన జీవితంపై తీస్తున్న ఈ సినిమాను కోర్టుకు వెళ్ళిఅడ్డుకొంటానని లక్ష్మీ పార్వతి ఇదివరకే హెచ్చరించారు. బహుశః అందుకే జగదీశ్వర్ రెడ్డి ఆవిధంగా చెప్పి ఉంటారు.  

 ఇది చదివారా? పవన్ అభిమానులకు స్వీట్ న్యూస్