బోయపాటితో మహేష్ సినిమా ఖాయమేనట

Tuesday Oct 31, 2017
Mahesh babu original

మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అను నేను’ సినిమాలో నటిస్తున్నాడు. దాని తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరో సినిమాకు ఓకె చెప్పేశాడు. అదికాక దర్శకుడు బోయపాటి శ్రీను చెప్పిన కధ కూడా నచ్చడంతో దానికీ ఓకె చెప్పేశాడని తాజా సమాచారం. ఆ సినిమాను పక్కా కమర్షియల్ సినిమాగా మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొని తీయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మహేష్ బాబుకు క్లాస్, ఫ్యామిలీ ఆడియన్స్ బేస్ చాలా బలంగానే ఉంది కానీ మాస్ బేస్ పెద్దగా లేకపోవడం వలన మినిమం గ్యారెంటీ అనుకొన్న సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని గుర్తించడంతో, మహేష్ బాబు పక్కా కమర్షియల్ సినిమా చేసేందుకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.

మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న ‘భరత్ అను నేను’ ఏప్రిల్ 27న రిలీజ్ కాబోతోంది. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత వంశీ పైడిపల్లితో సినిమా మొదలుపెడితే అది సెప్టెంబర్ నాటికి పూర్తి చేసి వచ్చే దసరా-దీపావళి పండుగకు అందించవచ్చు. దాని తరువాత బోయపాటితో సినిమా మొదలయ్యే అవకాశం ఉంటుంది. మహేష్-బోయపై సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఇది చదివారా?  అజ్మీర్ దర్గాను దర్శించుకొన్న హీరోయిన్