అలా చేస్తే ఆ డైరెక్టర్ కూడా అలా అయిపోయే అవకాశం ఉంది

Tuesday Oct 10, 2017
Mahanubhavudu initial talk original

మొన్న దసరాకి వచ్చిన సినిమాల్లో శర్వానంద్ హీరోగా, మెహ్రీన్ హీరోయిన్ గామారుతి  డైరెక్షన్ చేసిన మహానుభావుడు కూడా ఒకటి. పండగ సెలవులు కావడం, మహేష్ స్పైడర్ అంచనాలు అందుకోలేకపోవడం, అప్పటికే  జై లవ కుశ సినిమా రిలీజ్ అయ్యి వారం అయిపోవడం మహానుభావుడు సినిమాకి బాగా కలిసి వచ్చాయి. సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది.

కానీ ప్రేక్షకులకు సినిమా చూసాక మారుతి డైరెక్షన్ లో వచ్చిన 'భలే భలే మగాడివోయ్' సినిమా కి 'మహానుభావుడు'కి చాలా కామన్ పాయింట్స్ ఉన్న ఫీలింగ్స్ రాక మానలేదుభలే భలే మగాడివోయ్ సినిమాలో ఫస్ట్ హాఫ్ లో హీరోకి ఉన్న లోపం (మతి మరపు) వల్ల అతనికి వచ్చే కష్టాలు చూపిస్తారుఫస్ట్ హాఫ్ లో  హీరో ప్రేమలో పడతాడు. సెకండ్ హాఫ్ లో తనలో ఉన్న ఆ లోపం వల్ల తన ప్రేమ తనకు దూరం అవ్వకుండా ఎలా గెలుస్తాడు అనేది కథ.

పైన చెప్పిన కథలో మతిమరపు తీసేసి అతి శుభ్రంగా ఉండడంని పెడితే అదే మహానుభావుడు కథ.

టాలీవుడ్ లో ఒక ఫార్ములా సక్సెస్ అవుతే మళ్ళి మళ్ళి అదే ఫార్ములా పెట్టి సినిమా తీస్తే,  ప్రేక్షకులు ఇచ్చే రిజల్ట్స్ ఎలా ఉంటాయో మనకు బాగా తెలుసు. ఎంతో మంది ఒకప్పుడు హిట్ డైరెక్టర్స్ ల జాబితాలో ఉండీ ఇప్పుడు ప్లాప్ డైరెక్టర్ ల జాబితా లో చేరిపోయారు...ఆ లిస్ట్ మనం చెప్పనక్కర్లేదు .

మారుతి కూడా ఈ విషయాన్ని గ్రహించి, ప్లాప్ రాకముందే నెక్స్ట్  మూవీ డిఫరెంట్ గా  తీస్తాడా లేదో..చూడాలి