త్రివిక్రమ్ దర్శకత్వంలో మెగా బ్రదర్స్?

Thursday Nov 02, 2017
Trivikram chiru pk original

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్-పవన్ కళ్యాణ్ ల మద్య వృత్తిపరంగా ఉన్న అనుబందం కంటే స్నేహితులుగానే ఎక్కువ అనుబందం ఉందని అందరికీ తెలుసు. కనుక వారిరువురూ కలిసి పనిచేయడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం వారిరువురి కాంబినేషన్ లో (అజ్ఞాతవాసి) ఒక సినిమా తయారవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఒక ఆసక్తికరమైన విషయం వినబడుతోంది.

చిరంజీవి ‘సైరా’ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత, అయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారుట. మరో వార్త ఏమిటంటే, దానిలో పవన్ కళ్యాణ్ అతిధి పాత్ర చేయబోతున్నడుట. సినిమాలో పవన్ కళ్యాణ్ సుమారు అర్దగంటసేపు కనిపించబోతున్నాడని టాక్.

చిరంజీవి, పవన్ కళ్యాణ్ లతో తప్పకుండా ఒక సినిమా చేస్తానని కాంగ్రెస్ మాజీ ఎంపి టి. సుబ్బిరామిరెడ్డి ఇదివరకు ఒకసారి విశాఖలో ప్రకటించారు. బహుశః ఆ సినిమా ఇదే అయ్యుండవచ్చును. అయితే ఈ సినిమా గురించి ఇంతవరకు అధికారిక సమాచారం రాలేదు కనుక వారిలో ఎవరో ఒకరు దీనిని దృవీకరించేవరకు కేవలం ఊహాగానంగానే భావించకతప్పదు.   

ఇది చదివారా? కాజల్ స్థానంలో నివేదా థామస్?