నాగ్ తో సినిమా నవంబర్ లో స్టార్ట్: వర్మ

Monday Oct 30, 2017
Rgv nagarjuna original

రామ్ గోపాల్ వర్మ వంటి వివాదాస్పద దర్శకుడితో పనిచేయడానికి పెద్ద హీరోలు ఎవరూ ఇష్టపడరు కానీ నాగార్జున సిద్దపడ్డారు. తనకు ‘శివ’ వంటి సూపర్ హిట్ సినిమాను అందించాడనే గౌరవం, వర్మలో ఇంకా ఆనాటి ‘స్పార్క్’ ఉందనే నమ్మకమే బహుశః ఇందుకు కారణం అయ్యుండవచ్చు. అయితే కధ, పాత్రల ఎంపిక విషయంలో నాగార్జున చాలా జాగ్రత్తలు తీసుకొంటారనే సంగతి అందరికీ తెలిసిందే. కనుక రామ్ గోపాల్ వర్మ తీయబోతున్న ఈ సినిమాపై అప్పుడే అంచనాలు పెరుగుతున్నాయి.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ లో మొదలుపెట్టి, 2018 ఏప్రిల్ లో విడుదల చేయడానికి రామ్ గోపాల్ వర్మ సన్నాహాలు చేసుకొంటున్నాడు. దాని తరువాత వెంటనే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం మొదలుపెట్టి ఆగస్ట్ నాటికి పూర్తి చేసి సెప్టెంబర్ లో విడుదల చేస్తానని వర్మ ఇదివరకే ప్రకటించాడు. వచ్చే నెల నుంచే నాగార్జునతో సినిమా మొదలుపెట్టబోతున్నాడు కనుక త్వరలోనే ఆ సినిమా పేరు, హీరోయిన్ పేరు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తాడని ఆశించవచ్చు. 

ఇది చదివారా? ఆ ఇద్దరు దర్శకులకు లక్ష్మీ పార్వతి వార్నింగ్