వారిరువురు కలిసి చేసిన సూపర్ హిట్ ‘శివ’
ముహూర్తపు షాట్ ఫోటోను నాగార్జున ఫేస్-బుక్ లో పోస్ట్ చేసి, “1988లో నేను రాంగోపాల్
వర్మతో సినిమా చేయడానికి అంగీకరించినప్పుడు చాలా మంది షాక్ అయ్యారు కానీ వారి
అంచనాలు తప్పని వర్మ నిరూపించాడు. మళ్ళీ ఇప్పుడు 2017లో వర్మతో నేను సినిమా
చేస్తానని తెలిసి చాలా మంది సంతోషించారు...అనేక మంది షాక్ అయ్యారు కూడా. ఈసారి
కూడా రాంగోపాల్ వర్మ నిరూపించుకొంటాడని ఆశిద్దాం,” అని కామెంట్ పెట్టారు.
నాగార్జున చేసిన కామెంట్స్ పై వర్మ వెంటనే
స్పందిస్తూ, “వెల్ నాగ్..ఈసారి నేను మాటలు కాదు చేతలతో నిరూపించుకొంటాను. అయితే
ప్రతీసారి నేను ఎక్కువగా గొప్పలు చెప్పుకొని తక్కువ డెలివరీ చేస్తుంటాను. కానీ నా
కెరీర్ లో మొట్టమొదటిసారిగా, నోరు మూసుకొని నా సినిమాయే నా తరపు మాట్లాడేలా చేస్తాను,”
అని దణ్ణం పెడుతున్న చేతుల గుర్తులను పోస్ట్ చేశారు.
తరువాత మరో పోస్ట్ లో ‘హేయ్ నాగ్..ప్రతీసారి మీరు
తక్కువగా మాట్లాడుతుంటారు..నేను అతిగా మాట్లాడుతుంటాను. కానీ ఈసారి రివర్స్ కాబోతున్న
మన రోల్స్..రాక్ చేయబోతున్నాయి,” అని జవాబిచ్చాడు.
రాంగోపాల్ వర్మ పెట్టిన ఈ రెండు పోస్టులను నిశితంగా గమనించినట్లయితే, ఈ సినిమాను అతను ఒక సవాలుగా తీసుకొన్నాడని అర్ధం అవుతోంది. టాలీవుడ్ లో పెద్ద హీరోలు ఎవరూ వర్మతో చేయడానికి ఇష్టపడని సమయంలో నాగార్జున అతనికి ఈ అవకాశం ఇచ్చారు. ఇవ్వడమే కాకుండా ఆ సినిమా తన స్థాయికి తగ్గట్లుగా ఉండాలని గట్టిగానే చెప్పినట్లున్నారు. తన ఫేస్ బుక్ పోస్ట్ లలో అదే సూచిస్తున్నారు. అందుకు వర్మ కూడా తన స్వభావానికి భిన్నంగా అణకువగానే జవాబిస్తున్నాడు. మరి వారి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
ఇది చదివారా? ఆ కుటుంబానికి ఈ ‘సినిమా కష్టాలు’ ఏమిటో..