అయితే సవ్యసాచి పక్కన పెట్టినట్టేనా?

Monday Oct 09, 2017
Chaitu maruti original

చైతు-సమంతల పెళ్ళయిపోయింది..నేడోరేపో హైదరాబాద్ లో రిసెప్షన్..ఆ తరువాత హనీమూన్...ఇంతవరకు అందరికే తెలుసు కానీ వాళ్ళు తిరిగి వచ్చిన తరువాత చైతు మొదట ఏ సినిమా మొదలుపెడతాడు? అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. అతని తాజా యాక్షన్ చిత్రం ‘యుద్ధం శరణం’ బెడిసికొట్టడంతో తరువాత చేయాలనుకొన్న సవ్యసచిని తాత్కాలికంగా పక్కనపెట్టి మారుతి దర్శకత్వంలో తనకు బాగా అచ్చొచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ చేయవచ్చని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. దర్శకుడు మారుతి చెప్పిన మాటలు కూడా అదే బలపరుస్తున్నాయి.

“నేను నాగ చైతన్యను దృష్టిలో పెట్టుకొనే ఒక చక్కటి రొమాంటిక్ స్టోరీ వ్రాసుకొన్నాను. అక్కినేని హీరోలు అటువంటి కధలకు బ్రహ్మాండంగా సూట్ అవుతారు. నేను వ్రాసుకొన్న కధకు నాగ చైతన్య అయితేనే న్యాయం చేయగలడు. దీని స్క్రిప్ట్ దాదాపు పూర్తికావచ్చింది. నవంబర్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలనుకొంటున్నాను,” అని చెప్పారు. అంటే నాగ చైతన్య హనీమూన్ నుంచి తిరిగిరాగానే మారుతి దర్శకత్వంలో సినిమా మొదలుపెట్టబోతున్నాడని అర్ధం అవుతోంది. కనుక అది పూర్తి చేసిన తరువాత సవ్యసాచి మొదలుపెడతాడనుకోవచ్చు.


'మహానుభావుడు' చిత్రంతో శర్వానంద్ కు మంచి హిట్ ఇచ్చిన మారుతి, నాగ చైతన్యకు కూడా అంతకంటే గొప్ప హిట్ ఇవ్వాలనుకొంటున్నారు. తద్వారా తామిద్దరికీ మంచిపేరు వస్తుంది కూడా. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మించబోతున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ నాగ చైతన్య తో జతకట్టబోతోంది.