చైతు-సమంత పెళ్ళి ఫోటోలు కొత్తవి

Saturday Oct 07, 2017
6 original

శుక్రవారం  రాత్రి నాగ చైతన్య-సమంతలు హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకొన్నాక ఈరోజు సాయంత్రం క్రీస్టియన్ పద్ధతిలో చర్చిలో వివాహం చేసుకొన్నారు. నిన్న హిందూ సాంప్రదాయంలో జరిగిన పెళ్ళిలో చక్కగా చీర ధరించి అచ్చమైన తెలుగు ఆడపడుచులా చూడ ముచ్చటగా కనిపించిన సమంత, ఈరోజు తెల్లటి వెడ్డింగ్ గౌన్ ధరించి మిలమిల మెరిసిపోతోంది. అలాగే నిన్న చక్కగా పంచెకట్టులో కనిపించిన చైతు ఈరోజు నీట్ గా సూటు,బూటు ధరించి సమంత పక్కన టీవిగా నిలబడ్డాడు. నటుడు రాహుల్ రవీంద్రన్ ఆయన భార్య (డబ్బింగ్ ఆర్టిస్ట్) చిన్మయి కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఇక ఈ పెళ్ళి సందర్భంగా గోవాలో జరిగిన వేడుకలలో వెంకటేష్, నాగార్జున పాటలు పాడుతూ చిందేస్తుంటే, వారితో కొత్త పెళ్ళి కొడుకు నాగ చైతన్య కూడా చిందులు వేస్తుండటం ఫోటోలో చూడవచ్చు.   ఈ ఫోటోలు ముచ్చట్లు చూస్తుంటే గోవాలో చైతు-సమంత పెళ్ళి ఎంత గ్రాండ్ గా జరుగుతోందో ఊహించుకోవచ్చు. వారి వివాహపు ఫోటోల కోసం లింక్:   

http://www.cinemagala.com/gallery/events/chaitanya-samantha-christian-wedding