సుమారు 27 ఏళ్ళ విరామం తరువాత రామ్
గోపాల్ వర్మ మళ్ళీ నాగార్జునతో సినిమా చేయబోతున్నాడు. ఈనెల 20వ తేదీ నుంచి తమ సినిమా
రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని, త్వరలోనే అన్నపూర్ణా స్టూడియోలో ముహూర్తపు షాట్
తీయబోతున్నట్లు మూడు రోజుల క్రితమే వర్మ ప్రకటించాడు. దానిపై నాగార్జున కూడా ఈరోజు
“ఈ నెల 20వ తేదీ నుంచి వర్మ-మార్క్ యాక్షన్ తో కాప్-డ్రామా సినిమా మొదలుపెట్టబోతున్నందుకు
నాకు చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ఈ విషయాన్ని మొదట నేనే ప్రకటిద్దామనుకొన్నాను కానీ
నాకంటే ముందు మీడియాకు తెలిసిపోయింది,” అని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ‘కాప్-డ్రామా’
అని చెప్పడం గమనిస్తే ఈ సినిమాలో నాగార్జున పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నట్లు భావించవచ్చు.
ఇది యాక్షన్ ఫిలిం అని నాగార్జున మరొక క్లూ కూడా ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ డేట్
ఖరారు అయిపోయింది గనుక త్వరలోనే సినిమా పేరు, హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక
నిపుణుల పేర్లు, ఫస్ట్-లుక్ పోస్టర్ కూడా విడుదల చేస్తారేమో చూడాలి.
ఇది చదివారా? పాపం సిద్ధూ..