నాగ్ రిలేషన్ బాగానే మెయిన్టెయిన్ చేస్తున్నాడే!

Tuesday Sep 12, 2017
Kcr nagarjuna original

టాలీవుడ్ లో సీనియర్ హీరోలలో ఒకరైన నాగార్జున ఏనాడూ రాజకీయాలపై ఆసక్తి చూపకపోయినా అధికారంలో ఉన్నవారితో చక్కటి రిలేషన్స్ మెయిన్టెయిన్ చేస్తుంటారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో ఏవిధంగా మంచి రిలేషన్షిప్ మెయిన్టెయిన్ చేసేవారో ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వంతో కూడా అలాగే మెయిన్టెయిన్ చేస్తుండటం విశేషం. కారణాలు అందరికీ తెలుసు కనుక మళ్ళీ చెప్పుకోనవసరం లేదు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ డిల్లీలో కంటి ఆపరేషన్ చేయించుకొని హైదరాబాద్ తిరిగిరాగానే సహజంగానే అధికార పార్టీ నేతలు ఆయనను పరామర్శించడానికి వెళుతున్నారు. వారందరికంటే ముందుగా అక్కినేని నాగార్జున వెళ్ళడమే విశేషం. నాగార్జున తన సోదరుడు వెంకట్ తో కలిసి సోమవారం సిఎం అధికారిక నివాసమైన ప్రగతి భవన్ కు వెళ్ళి ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించివచ్చారు.