నారా రోహిత్, జగపతిబాబు ఇద్దరూ ఆటగాళ్ళే

Thursday Oct 12, 2017
Aatagallu %281%29 original

నారా రోహిత్, జగపతిబాబు ప్రధాన పాత్రలలో నటిస్తున్న సినిమాకు ‘ఆటగాళ్ళు’ అనే పేరు ఖరారు చేశారు. సబ్-టైటిల్ గా ‘గేమ్ ఫర్ లైఫ్’ అని పెట్టారు. పరుచూరి మురళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ బుధవారం హైదరాబాద్ లో లాంచనంగా ప్రారంభం అయ్యింది. దీనికి సంబందించిన పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి మద్యలో విడుదలయ్యే అవకాశం ఉంది

నారా రోహిత్ ప్రస్తుతం పవన్ మల్లెల దర్శకత్వంలో ‘బాలకృష్ణుడు’ సినిమా చేస్తున్నాడు. దానిలో రెజినా హీరోయిన్ గా చేస్తోంది. మహేంద్రబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 14న విడుదల కాబోతోంది. దీనిలో వెన్నెల కిషోర్, రమ్యకృష్ణ, అజయ్, పృద్వీ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించారు.