ద్రౌపదిగా నయనతార

Thursday Jul 06, 2017
Sri rama jayam nayanthara sita stills 0429 original

ఆరేళ్ళ క్రితం బాలకృష్ణ తో కలిసి సీతగా శ్రీ రామరాజ్యం అనే సినిమాలో సీతగా నటించి అందరిని మెప్పించింది నయనతార. ఈ చిత్రానికి బాపు గారు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా లో తన నటనకు ఫిలిం ఫేర్ అవార్డు కూడా రావడం విశేషం. అయితే ఇపుడు ఈమె పురాణాలకు సంబందించిన మరో సినిమా లో నటించబోతోంది వార్తలు వస్తున్నాయ్.అయితే ఈ సారి ఈమె ద్రౌపదిగా ఒక కన్నడ సినిమాలో నటించనుంది. ఈ సినిమా లో దుర్యోధనుడిగా  కన్నడ హీరో దర్శన్ నటించనున్నాడు.ఈ సినిమాకు కురుక్షేత్ర అనే పేరు పెట్టినట్లు తెలుస్తోంది.