నాన్న కూచి నిహారిక త్వరలో...

Saturday Oct 28, 2017
Nanna koochi web series original

నాగబాబు కూతురు నిహారిక చేసిన మొదటి సినిమా 'ఒక మనసు' పెద్దగా ఆడకపోయినా దానిలో ఆమె డీసెంట్ పెర్ఫార్మెన్స్ కు మంచి మార్కులే సంపాదించుకొంది. అయితే ఆమె సినిమాలో కంటే టీవీ షోలలోనే ఎక్కువ పాపులర్. అంతకు ముందు ఆమె తన తండ్రి నాగబాబుతో కలిసి ‘ముద్దపప్పు ఆవకాయ’ అనే వెబ్ సిరీస్ చేసింది. అది కూడా ఆమెకు చాలా మంచిపేరు తెచ్చిపెట్టింది. దాని స్పూర్తితోనే అనేకమంది ఔత్సాహిక దర్శకులు వెబ్ సిరీస్ లను తీయడం మొదలుపెట్టారు.

సినిమా చేయడం కంటే వెబ్ సిరీస్ చేయడం చాలా సులువు గనుక, మళ్ళీ తండ్రీకూతుళ్ళు ఇద్దరూ కలిసి మరో వెబ్ సిరీస్ చేయడానికి సిద్దం అయ్యారు. నిహారిక నిజజీవితంలో కూడా ‘నాన్న కూచి’ కావడంతో ఈ కొత్త సిరీస్ కు ‘నాన్న కూచి’ అనే పేరే ఖారారు చేశారు. ఈ వెబ్ సిరీస్ లో వారే తండ్రీకూతుళ్ళుగా నటిస్తున్నారు. వారి నిజజీవితంలో వారి మద్య ఉన్న అనుబందం, అలకలు, కోపాలు వగైరాలన్నీ ఈ వెబ్ సిరీస్ లో హృద్యంగా చూపించబోతున్నారు.

సినిమాల మాదిరిగానే వీటికీ ట్రైలర్స్ ఉంటాయి కనుక నాన్న కూచి ట్రైలర్ ను రేపు అంటే ఆదివారం విడుదల చేయబోతున్నట్లు వరుణ్ తేజ్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. దానితోపాటు ఆ వెబ్ సిరీస్ కు సంబందించిన ఒక ఫోటో కూడా పెట్టాడు. అంటే దానిని ఫస్ట్-లుక్ పోస్టర్ అనుకోవచ్చు. మరి ఈ సిరీస్ ఏవిధంగా ఉంటుందో చూద్దాం.

ఇది చదివారా? పవన్ మరో సినిమాకు సిద్దం?