'నిన్ను కోరి' స్టోరీ కాపీ కొట్టారా??

Thursday Jul 06, 2017
Nanis ninnu kori movie adiga adiga song teaser original

ఇంకా సినిమా కూడా రిలీజ్ కాకముందే కేవలం ట్రైలర్ చూసి ఈ సినిమా ఆ సినిమా కు కాపీ అనేస్తున్నారు ఈ మధ్య. అలాంటి వివాదం ఈ మధ్యనే హిందీ సినిమా రాబ్తా కు ఎదురైంది. మగధీర తో కొన్ని పోలికలు ఉండడం తో ఈ సినిమా మగధీర కు కాపీ అని ఫిక్స్ అయిపోయారు. నిర్మాత అల్లు అరవింద్ అయితే ఏకంగా కేసు కూడా వేసాడు. అయితే ఈ వివాదం ఎలాగోలా సద్దుమణిగింది. అయితే ఇపుడు లేటెస్ట్ గా నాని నటిస్తున్న నిన్ను కోరి సినిమా పాత హిందీ చిత్రం అయిన హం దిల్ దె చుక్ హై సనమ్ కాపీ అని ప్రచారం సాగుతోంది. అయితే ఇంకా సినిమా స్టోరీ కూడా తెలియకముందే కేవలం ట్రైలర్ చూసి ఇలా అనడం ఎంత వరకు కరెక్ట్ అని సినిమా బృందం అంటోంది. రెండు త్రికోణ ప్రేమ కథలు కావడం తో జనాలు ఆలా ఫిక్స్ అయి ఉండచ్చు. మరి వివాదం ఎందుకనుకున్నాడో ఏమో నిర్మాత కోన వెంకట్ హం దిల్ దె చుక్ హై సనమ్ దర్శకుడైన సంజయ్ లీల బన్సాలి ని కలిసి స్టోరీ మొత్తం చెప్పాడంట. బన్సాలి కూడా ఇది కాపీ కాదని చెప్పడం తో వివాదం సద్దు మణిగింది. పైగా సినిమా కథ బావుందని మెచ్చుకున్నారట.